MCN NEWS
ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ సచివాలయం వద్ద శ్రీ స్వామి వివేకానంద 160 వ జయంతి,జాతీయ యువజన వారోత్సవాలు సందర్భంగా ఆయన విగ్రహానికి సిరిపురం వివేకానంద యూత్ అధ్యక్షుడు సింగిలిదేవి సత్య దుర్గ ఆద్వర్యం లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధి కొల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ నరేంద్రుడు బోధనలు నేటి యువతకు అనుసరణీయం, ఆదర్శప్రాయమని కొనియాడారు. యువత దేశభక్తిని పెంపొందించు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాకే కృష్ణారావు, గ్రామ పెద్దలు దనేకుల రామకృష్ణ, డాక్టర్ దొడ్డి సుబ్బారావు,వజ్రంగి సల్మాన్ రాజు, కేసరియా హిందూ వాహిని మండల అధ్యక్షులు శిష్ట సుబ్రహ్మణ్యం, శివ, టీ. నాగ శివ, టీ. భద్రరావు తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద 160వ జయంతి…
ADD
RELATED ARTICLES