MCN NEWS : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కౌన్సిలింగ్ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విజ్ఞాన్ జూనియర్ కళాశాల నందు నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా!! మల్లిడి అమ్మిరెడ్డిగ ముఖ్య అతిథిగా విద్యార్థుల సమక్షం లో వివేకానందుని జయంతి కార్యక్రమం ను ఘనంగా జరిపారు.వివేకానందుని జయంతిని పురస్కరించుకుని నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా!!మల్లిడి అమ్మి రెడ్డి వివేకానందుని యొక్క జీవిత విశేషాలు,జీవితం లో ఆయన ఎదుర్కొన్న సంఘటనల గురించి విద్యార్థులు కు తెలియజేశారు..విజ్ఞాన్ కళాశాల ప్రిన్సిపల్ సబ్బెళ్ళ. అచ్చిరెడ్డి వివేకానందుని గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసారు
ఈ కార్యక్రమం లో నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా!!మల్లిడి అమ్మిరెడ్డి , వి ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ శేషా వేణి గారు వి ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లిడి.సతీష్ రెడ్డి గారు,విజ్ఞాన్ కళాశాల డైరెక్టర్ టి. పార్వతి ,టి. అమ్మి రెడ్డి , తాతారెడ్డి గారు,విజ్ఞాన్ కళాశాల ప్రిన్సిపల్ యస్. అచ్చిరెడ్డి ,విజ్ఞాన్ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థిని విద్యార్దులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద సూక్తులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి
ADD
RELATED ARTICLES