MCN NEWS : జంగారెడ్డిగూడెం
ఏలూరు జిల్లా జంగారెడ్డి పట్టణంలో సబ్ రిజిస్టార్ కా ర్యాలయం ప్రక్కనగల స్టాంప్ వెండర్ల యొక్క కార్యాలయంలో స్టాంపులు అమ్మకాలపై ఏలూరు జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం నాడు డేకాయ్ ఆపరేషన్ లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశారు స్టాంప్ వెండర్లు స్టాంపు విక్రయాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తాము ఈ తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు 50 మరియు 100 రూపాయలు స్టాంపులను 50 రూపాయలు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నట్లు వ్యత్యాసం గుర్తించామన్నారు నలుగురు స్టాంప్ వెండర్లు అధిక ధరలకు స్టాంపులను విక్రయిస్తున్నట్లు వారు తన తప్పును తమ వద్ద ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే రిజిస్టర్లు నిర్వహణ లామాదేవిలని కూడా వారు ఎప్పటికప్పుడు సరిపోల్చడం లేదన్నారు విజిలెన్స్ ఎస్పి కరణం బలరాం ఆదేశాల మేరకు తాము ఈరోజు ఇక్కడ తనిఖీలు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారుల బృందం ఏఈ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు స్టాంపు వండర్లా అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు వీఆర్వో బాజీ పంచినామా నివేదికలు విజిలెన్స్ వారికి సమర్పించినారు విజిలెన్స్ సిఐ శివరామ కృష్ణ ఎస్సై నాగరాజు ఏఈ శ్రీనివాసరావు ఏజీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఉన్నతాధికారుల ఆదేశాలతో డేకాయ్ ఆపరేషన్ లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల స్టాంపు వండర్లపై తనిఖీలు జరుగుతున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యులు తెలిపారు ఈరోజు జరిగిన అన్ని తనిఖీల్లో కూడా ప్రశాంతి టవర్ వద్ద గల కార్యాలయంలో జరిగాయి