నిద్రపోతున్న సంబంధిత అధికారులు
MCN NEWS : బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోలు కెనాల్ రోడ్ లో షాప్ నెంబర్ 385 గా ప్రభుత్వంచే గుర్తింపు పొంది మద్యం విక్రయిస్తున్న షాపు లోనే బార్లు నడుస్తుండటం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్నే తగ్గించాలని ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే ప్రభుత్వం చే నడపబడుతున్న మద్యం షాపులే బార్లుగా మద్యం ప్రియులకు కావలసినవన్నీ సప్లై చేయడంపై పలువురు ముక్కున వేరేసుకుంటున్నారు.
బిక్కవోలు కెనాల్ రోడ్లో గల షాప్ 385 లో ఎదయోచ్చగా వచ్చిన వాళ్ళు కూర్చుని మద్యం సేవించడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వ మద్యం దుకాణం వాళ్లే సమకూర్చడం గమనార్హం ఇదే విషయంపై విలేకరుల ప్రశ్నించగా మద్యం షాపుకు సంబంధించిన ఉద్యోగి నాకు సంబంధం లేదంటూనే కూర్చుని సేవించడానికి దారి చూపుతున్నాడు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం నిర్వహించే మద్యం షాపులు తాలూకా బారులపై బెల్ట్ షాపులపై స్పందించకపోతే తెలుగుదేశం మరియు జనసేన బిజెపి కార్యకర్తలు ఉద్యమం చేపడుతామని హెచ్చరిస్తున్నారు