MCN NEWS : ఏలేశ్వరం; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ దేశ రక్షణ బేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఏలేశ్వరంలో సిపిఎం ప్రసార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు చెక్కల రాజ్ కుమార్, మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, తగ్గించాలని, చెత్త పై పన్ను రద్దు చేయాలని, ఎన్నికల మీలో భాగంగా కేంద్రంలో ఉన్న 13 లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిల్ల రాంబాబు, వేమగిరి దొంగబాబు, గండి వెంకట్రావు, పెదపాటి గుర్రయ్యమ్మ, వంగలపూడి అప్పయ్యమ్మ, సీలి బాలమ్మ ఉన్నారు.
సిపిఎం దేశ రక్షణ బేరి ప్రచారం.
ADD
RELATED ARTICLES