MCN NEWS : ఏలేశ్వరం: సిఐటియు అనుబంధ సంఘాల నుండి మండల కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదర్శ భవనిర్మాణ కార్మిక సంఘం భవనంలో సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో జరిగిన సిఐటియు మండల మహాసభ లో కార్యవర్గ ఎంపిక జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని పన్ను బారాలను వేస్తున్నాయన్నారు. చెత్త పన్నులు కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచారు అన్నారు. అనంతరం సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు ఎన్నికల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మండల అధ్యక్షురాలుగా కాకరపల్లి సునీత, కార్యదర్శుల పిల్లా రాంబాబు, ఉపాధ్యక్షులుగా సుందరపల్లి సూరిబాబు, భవాని, ఎం రామలక్ష్మి, సహకార్య దర్శులుగా ఖాసి, డి మరియ, సిహెచ్ వెంకటలక్ష్మి, కె సత్యవేణి, కార్యవర్గ సభ్యులుగా ధనబాబు, ఎస్ భవాని, అమలావతి, ఎం శ్రీలత, షేక్ సుభాని ఎన్నికయ్యారు.
సిఐటియు నూతన సారథులు వీరే
ADD
RELATED ARTICLES