ఉపాధ్యాయనీలతో కిర్లంపూడి విద్యాశాఖ అధికారి టి.జోసెఫ్.
మెట్టజ్యోతి : కిర్లంపూడి కాకినాడ జిల్లా. సంఘసంస్కర్త సత్యశోధక వ్యవస్థాపకరాలు సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను మహిళా ఉద్యోగులందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కిర్లంపూడి మండల విద్యాశాఖ అధికారి టీ. జోసెఫ్ పిలుపునిచ్చారు. అందుచేతనే మన ప్రభుత్వాలు ఆ మహనీయురాలు జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మండల కేంద్రం కిర్లంపూడి లో జాతీయ మహిళా దినోత్సవo వేడుకలను యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మెయిన్ స్కూల్లో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించగా ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి టి.జోషప్ విచ్చేసి మహిళా టీచర్లను ఉద్దేశించి పైవిధంగా మాట్లాడారు. ముందుగా సావిత్రిబాయి పూలే మన సమాజానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ అందుకు ప్రతీకగా మండలంలో వివిధ పాఠశాలలో ఉపాధ్యాయినీలుగా పనిచేస్తున్న ఆరుగురు మహిళలకు సన్మానం చేసే కార్యక్రమానికి ఐక్య ఉపాధ్యాయ సంఘం సన్నద్ధం అయ్యింది. అందులో భాగంగా బూరుగుపూడి ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయని సి.హెచ్ విజయలక్ష్మి తామరాడ ఉన్నత పాఠశాలలో జీవ శాస్త్రం ఉపాధ్యాయని షమ్మ, సింహాద్రిపురం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్న ఆడారి ధనలక్ష్మి తో పాటు ప్రైమరీ స్కూల్స్ ఉపాధ్యాయినిలు నీరజ, వరలక్ష్మి, ఎన్. ఉమాదేవిలను కూడా విద్యాశాఖ అధికారి సమక్షంలో యుటిఎఫ్ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క బాలిక చదువుకునే విధంగా మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని విద్యాశాఖ అధికారి టి. జోసెఫ్ కోరారు. అదేవిధంగా ఓర్పు నేర్పు వంటి విద్య పద్ధతులను విద్యార్థినిలకు పాఠ్యాంశాలు మాదిరిగా బోధించి సమాజంలో ఉన్నతమైన మార్పులు తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించాలని ఎం.ఈ.ఓ మహిళా టీచర్లకు సూచించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయరాళ్లు విజయలక్ష్మి, షమ్మ, ధనలక్ష్మి లు సత్కర సభలో మాట్లాడారు. అదేవిధంగా యు.టి.ఎఫ్ నాయకులు బాలిన నూకరాజు, పినికేటి సావిత్రి, బొడ్డేటి ధనలక్ష్మిలు సావిత్రిబాయి గొప్పతనo గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయనీలు పీలా వీరజ్యోతి, గంధం అనంతలక్ష్మి, భానుమతి, ఎమ్. దేవి, పీలా నాగవరలక్ష్మీ, మక్కా రోజి, అదేవిధంగా UTF నాయకులు వై. వెంకటేష్ పి.రమణబాబు, AVV రమణ, NV రమణ, N. కన్నబాబు తో పాటు కర్రీ శ్రీను, పొలమరశెట్టి సాయి, రాపేటి అనిల్ పాల్గొన్నారు.