MCN NEWS : శంఖవరం :సంక్రాతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, జూదం ఇతర ఆటలకు యువత దూరంగా ఉండాలని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువత పేకాట, కోడిపందాలు, అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్లకుండా క్రీడలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని అన్నవరం ఎస్ఐ పి శోభన్ కుమార్ తెలిపారు. సాంప్రదాయ క్రీడలు నిర్వహణపై స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమైన కోడిపందాలు నిర్వహించరాదని,అందుకు సంబంధించి ఏమైనా బరులు ఏర్పాటు చేస్తే వాటిని గుర్తించి తొలగించాలన్నారు . ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి హైకోర్టు ఉత్త ర్వులు పక్కాగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్ల సహకారం తీసుకోవాలని, ఏవిధమైన అసాంఘిక జూద క్రీడలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాంప్రదాయ పండుగల వేళ అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ మన్నారు. రంగవల్లులు, క్రికెట్, ఎడ్ల పందాలు లాంటి సంప్రదాయ పండుగలు నిర్వహించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించండి
ADD
RELATED ARTICLES