వివిధ వేషధారణలో అలరించిన చిన్నారులు
MCN NEWS : సంక్రాంతి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు వంటివి తెలుగు జాతి చిహ్నాలని ముఖ్యంగా పల్లెటూరులో సంక్రాంతి అనగానే అందరి హృదయ లో ఆనందం నింపే పడగానే సత్యవతి స్కూల్ కస్పాండెంట్ కోలా చందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు వంటివి తెలుగుజాతికి చిహ్నాలని,భారతీయ ప్రాచీన సంప్రదాయాలను గౌరవించాలని, దేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అయన పేర్కొన్నారు.
మకర సంక్రాంతి భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన రోజు మరియు సర్వశక్తిమంతుడైన సూర్యునికి అంకితం చేయబన రోజు అని సమృద్ధిగా ఉన్న వనరులకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ మకర సంక్రాంతి అని అలాగే రైతులకు పంట కాలం ప్రారంభమైనందున రైతులు ప్రత్యేక పండుగ అని అన్నారు,దేశవ్యాప్తంగా రైతులు సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మంచి పంట పండాలని ఆకాంక్షించారు.
కనుమరుగవుతున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు వివిధ వేశాధారణాలతో పల్లె వాతావరణం నెలకొన్నట్లు, పల్లె జీవన విధానము అద్దం పట్టినట్లు విద్యార్థులు ప్రదర్శించిన కళ నైపుణ్యం విక్షించిన ప్రతి ఒక్కరిని అబ్బుర పరచింది.గ్రామీణ ప్రాంతంలో పల్లె కళాఖండంను సొంతంగా తయారు చేసిన పల్లెలో గృహములు వాటి అలంకరణ చూపరులను ఆకట్టుకున్నాయి.
గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు గానాలు,సోదమ్మా సోది,జంగమ దేవర అనంతరం చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, గాలిపటాల ఎగురవేత అందర్నీ ఆకర్షితులు చేశాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి వీరబాబు మరియు ఉపాధ్యాయులు పిల్లలు తల్లితండ్రులు పాల్గొన్నారు.