MCN NEWS : శంఖవరం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందిస్తున్న సచివాలయాలు వాడుకలోకి వచ్చే విధంగా త్వరగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ తెలిపారు. మండలంలోని నెల్లిపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవన పనులను ఎమ్మెల్యే పర్వత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకత పాలన అందించేందుకు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వీటి ద్వారా నేరుగా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ నరాల శ్రీనివాసు, సర్పంచ్ నరాల శ్రీదేవి తాతబ్బాయి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ పనులు వేగవంతం చేయాలి-ఎమ్మెల్యే పర్వత..
ADD
RELATED ARTICLES