-
అన్నదానంలో పాల్గొన్న ఎంపిపి పర్వత .
MCN NEWS : శంఖవరం. మండల కేంద్ర మైన శంఖవరం గ్రామంలో శ్రీ దత్త సాయి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలను పురష్కరించుకుని బుధవారం ఉదయం బారి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ అన్నదాన కార్యక్రమంలో యమ్ పి పి పర్వత రాజబాబు పాల్గోని స్వయంగా వడ్డన చేశారు. గ్రామ ప్రజలు తో పాటు పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు , బాటసారులు,వాహన దారులు ,భవానీ మాలధారులు అనేకమంది తరలి వచ్చి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు.ప మద్యాహ్నం3గంటలు వరకు నిరంతరాయంగా అన్నసమారాధన కొన సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందరికీ ప్రసాదం అందే విధంగా చర్యలు చేపట్టారు.