- ప్రభుత్వ ఆసుపత్రి మరియు మోడల్ స్కూల్ తనిఖీ.
- నిర్మాణం లో ఉన్న నూతన పిహెచ్ సి పరిశీలన.
- 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి.
- మద్యాహ్నం భోజనం పై అసంతృప్తి.
MCN NEWS : శంఖవరం : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు ,సేవలు అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్ల తెలిపారు. మండల కేంద్ర మైన శంఖవరం గ్రామంలో గల గల శ్రీ పర్వత సుబ్బయ్యమ్మ ఉన్నత శ్రేణి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా నిర్మాణ దశలో ఉన్న నూతన పిహెచ్ సి ని పరిశీలించి ప్రతీ గది ఏర్పాటు పై వివరాలు అడిగి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్క ను నాటారు.ప్రస్తుతం వాడుక లో ఉన్న ఆసుపత్రిని సందర్శించి డిస్పెన్సిరీలో ఉన్న లేబోరేటరీ,మెటర్నటీ, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను స్వయంగా తెలుసుకుని వైద్య సేవలును మెరుగు పరచి ఆసుపత్రికి వచ్చే ప్రతీ ఒకరికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో ఎప్పటినుంచో హోమియో ఆసుపత్రి వైద్యులు లేక మూతపడింది అని పలువురు తెలపగా త్వరలోనే హోమియో వైద్యుని ఏర్పాటు చేసి సేవలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి కేసులు వివరాలును అడిగి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎపి మోడల్ స్కూల్ ను సందర్శించి అక్కడ విద్యార్థులకు అందించే మద్యాహ్నం బోజునం ను పరిశీలించి మెరుగైన బోజునం అందించే విధంగా ఆల్లూరి ట్రస్టు వారితో మాట్లాడి చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు యొక్క పాఠ్యాంశాలను స్వయంగా విద్యార్థులు చే చదివించి అబినందించి వారికి అందించే సదుపాయాలు పై వివరణ అడగగా షూష్ రాలేదని ,అలాగే జగనన్న బ్యాగ్ లు సరిపోవడం లేదని చిన్నివిగా ఉన్నాయి అని తెలిపగా త్వరలోనే షూష్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.. విద్యార్థులకు అందించే మంచి నీటి ట్యాంక్ బాగోలేదని ప్రిన్సిపాల్ కృష్ణ వేణి తెలపగా వెంటనే ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల యమ్ పి పి పర్వత రాజబాబు, ఉప సర్పంచ్ చింతమనీడి కుమార్, వైకాపా నాయకులు బొర్రా లచ్చబాబు, జిల్లా వైద్య శాఖాధికారి డా ఆర్ రమేష్ ,ఆర్ బి యస్ కె జిల్లా కో ఆర్డినేటర్ ఐ ప్రభాకర్, పెద్దాపురం డివిజన్ ఆర్ డి ఓ జె సితారామారావు,డి ఎల్డిఓ కె యన్ వి ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు, మండల వైద్యాధికారి ఆర్ వి వి సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి యస్ వి రమణ,అన్నవరం ఎస్సై శోభన్ కుమార్, ప్రత్యేక అధికారి చంద్రరావు,చైర్మన్ జట్లా అప్పారావు, పంచాయతీ సెక్రటరీ శ్రీ రామచంద్రమూర్తి, శంఖరాచార్యులు,సత్య వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్ట్రర్ : వై వెంకటరావు