MCN NEWS : శంఖవరం. మండలంలోని వేళంగి గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక నిధులతో శ్రీ వాణి ట్రస్టు ద్వారా పది లక్షల రూపాయలతో శ్రీ కోదండరామ ఆలయం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది.ఈ సంధర్భంగా సర్పంచ్ సుబ్బయ్యమ్మ మాట్లాడుతూ రామాలయం నిర్మాణానికి సహకరించన వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే నిర్మణం పనులు పూర్తి అయ్యే విధంగా అందరూ సహయసహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పండు , మాజీ సర్పంచ్ మేకల సత్యనారాయణ, సమరసత ఫౌండేషన్ మండల కన్వీనర్ అధట్రా వరహాలబాబు, ధర్మ ప్రచారక్ పడాల రాంబాబు, దేవస్థానం కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేళంగి లో కోదండ రామ ఆలయం శంఖుస్థాపన.
ADD
RELATED ARTICLES