MCN NEWS : అనపర్తి: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండల పరిధిలో గల పొలమూరు లో వేంచేసియున్న రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి నిత్యమాస కళ్యాణ వార్షికోత్సవ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖానస ఆగమ విధానంలో వేద పండితులు వాడపల్లి వేణుగోపాలాచార్యులు , అర్చక స్వామి వంశీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో స్వామికి విశేష పూజలు, తులసి పూజ జరిపించారు. ఆలయంలో ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున నిర్వహించే శాంతికర కల్యాణోత్సవాలు ప్రారంభించి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం స్వామికి విస్వక్షేనా పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, మండపారాధన, పంచామృత అభిషేకం జరిపించారు. అనంతరం విశేష తులసి పూజ, కుంకుమార్చన, శాంతికర కళ్యాణం వైభవముగ జరిగింది. ఈ సందర్బముగా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తాడి అమ్మిరెడ్డి శ్రీమతి శేషయ్యమ్మ దంపతులచే కార్యక్రమం ఆద్యంతం ఘనంగా నిర్వహించారు. వైఖానస వేదపండితులు చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, వాడపల్లి శ్రీరామ్ ఆచార్యులు కల్యాణ కార్యక్రమం జరిపించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.
కన్నులపండువగా శోభాయాత్ర శ్రీ మదనగోపాలస్వామి వారి నిత్యమాస కల్యాణ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి ఉత్సవ మూర్తులకు శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక పల్లకిలో స్వామిని కూర్చోబెట్టి వివిధ పుష్పాలతో అలంకరించి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, బాణాసంచా కాల్పులు , కోలాట నృత్యాలు తో భక్తులు సందడిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, కమిటీ ఛైర్మెన్ తమలంపూడి వీరయ్యమ్మ ఆదిరెడ్డి, తాడి ఆంజనేయరెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేడుకగా నిత్యమాస కల్యాణ వార్షికోత్సవం
ADD
RELATED ARTICLES