Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లావిలేకరి అరెస్టు నిరసిస్తూ ఆందోళన.

విలేకరి అరెస్టు నిరసిస్తూ ఆందోళన.

MCN NEWS :ఏలేశ్వరం: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున విలేకరి పట్ల పొలిసుల అనుచిత వైఖరి నిరసిస్తూ ఏలేశ్వరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా స్థానిక బాలాజీ సౌక్ సెంటర్లో రాస్తారోకో చేపట్టి అనంతరం ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రత్తి శ్రీనివాస్ , మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి డి సతీష్ బాబు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ అంకంబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యకం అన్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడమే కాకుండా ఏ స్టేషన్లో ఉన్నాడో సాటి విలేకరులకు కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా స్టేషన్లు తిప్పారన్నారు. హార్ట్ పేషెంట్ గా ఉన్న అంకం బాబుకు మందులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం పోలీసుల నిరంకుశ విధానానికి తార్కాంణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంకంబాబు పై కేసులు వెత్తేసి పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ గంధం రవి కృష్ణ వరప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments