మండలంలోని బశినేనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వం విద్యార్థులుకు అందించిన బ్యాగ్ లు, పుస్తక సామాగ్రిని వైస్సార్సీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, ఎం ఈ ఓ మస్తాన్ వలి చేతులు మీదుగా మంగళవారం విద్యార్థులుకు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థుల కు గతంలో ఎన్నుడూ లేనివిధంగా విలువైన విద్యాసామాగ్రి అంద చేయ డంతోపాటు, జగనన్న గోరు ముద్ద పథకం తో మంచి పోషకాహారం అందుతుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పన తో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వలన ప్రవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు అంజయ్య, సర్పంచ్ పల్లె విజయమ్మనూతన్,స్కూల్ కమిటీ చైర్మన్ తిరుపతయ్య, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులుకు బ్యాగ్ లు పంపిణీ
ADD
RELATED ARTICLES