మెట్టజ్యోతి: అనకాపల్లి. లయన్స్ క్లబ్ 56వ ప్రెసిడెంట్ గా సిహెచ్ ఐ మైకేల్, సెక్రెటరీగా ఎం రాకేష్, ట్రెజరర్ గా జి ఎన్ వి డి రత్నాజీ రావు ఎన్నికయ్యారు. వీరి పదవి కాలము జూలై 1 2022 నుండి 30 జూలై 2023 వరకు ఉంటుంది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినందుకు గర్వంగా ఉన్నదని, తను రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి క్లబ్ ఉన్నత పదవులకు తీసుకెళ్లగలనని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా అనిల్ కుమార్, సైట్ ఇన్సులేషన్ ఆఫీసర్గా బాదం బాలకృష్ణ, పూర్వపు జిల్లా గవర్నర్ వి ఎస్ నూకరాజు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇండక్షన్ ఆఫీసర్గా ఈ మీటింగ్ కి వచ్చి లైనిజం గురించి ఉపన్యసించినారు. ఈ కార్యక్రమానికి సుమారు 120 మంది సభ్యులు హాజరైనారు.ఈ సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు.అందులో భాగంగా కొంత మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందజేశారు. అనకాపల్లి పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ లను, కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన స్టాఫ్ నర్సులు వాలంటీర్లను సత్కరించారు
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా సి హెచ్ ఐ మైకేల్.
ADD
RELATED ARTICLES