-
జిల్లాపరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గళమెత్తిన జెడ్పీటీసీ వడుగులజ్యోతి
MCN NEWS : రాజువమ్మంగి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపరిషత్ లో జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశంలో రాజవొమ్మంగి జెడ్పీటీసీ వడుగుల జ్యోతి పాల్గొని రోడ్లు అద్వాన్నస్థి తులపై ద్వజమెత్తారు..ఏజెన్సీ వాసులు ముఖద్వారము అయిన ఏలేశ్వరం నిత్యం వేలాది మంది విద్య, వైద్య,మార్కెటింగ్ తదితర అన్ని పనులకు వెళుతుంటారు..కానీ ఇప్పుడు ఏలేశ్వరం వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు..ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..ఎప్పుడు ఎక్కిన బస్సు బురదలో కూరుకుపోతుందో తెలియని పరిస్థితి అని మంజూరైన రోడ్డును కూడా వేయించలేని స్థితిలో అధికారులు ఉండడం శోచనీయమని ద్వజమెత్తారు..
చైర్మన్ వేణుగోపాల్ రావు గారు మరియు ఆర్ అండ్ బి, ఎస్ ఈ, సమాధానమిస్తూ నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు..వెంటనే మీరు చేయకుంటే మేం గిరిజన ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామన్నారు..అదే విధంగా మండలం లో జడ్డంగి నుండి వంచంగి మీదుగా గొంటువానిపాలెం ఆర్ అండ్ బి తార్ రోడ్ శిధిలావస్థలో ఉందని వెంటనే పునర్నిర్మాణం మంజూరు చేయాలన్నారు.
జడ్డంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కు అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మించాలన్నారు.రోగులు భరించకుండా అంబులెన్స్ కు సరిపడా డీజిల్ ఏర్పాటుచేయాలని,108 సేవలు మండలం నుండి ఏలేశ్వరం వరకే కాకుండా కాకినాడ వరకూ పొడిగించాలని కోరారు.
తగు చర్యలు చేపడతామని జెడ్పీటీసీ జ్యోతికి జెడ్పి చైర్మన్ మరియు సంభందిత అధికార్లు హామీ ఇచ్చారు.