MCN NEWS :అనపర్తి:తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని 23 జనవరి2023న రైఫిల్ షూటింగ్స్ సెలక్షన్స్ పిస్టల్ విభాగంలో నల్లమిల్లి శ్రీ జానకి జి బి ఆర్ డిగ్రీ కళాశాల బి జెడ్ సి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.
ఈమే ఫిబ్రవరి 15 మీరట్లో జరిగే స్వామి వివేకానంద సబర్మతి యూనివర్సిటీ, ఆల్ ఇండియా షూటింగ్లో పాల్గొననుంది .ఈ రైఫిల్ షూటింగ్ పిస్టల్ విభాగంలో సాధించిన నల్లమిల్లి శ్రీ జానికిని ఈమే తండ్రి నల్లమిల్లి సత్తిరెడ్డి అనపర్తి బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడుగా పనిచేయుచున్నారు కళాశాల కరస్పాండెంట్ తేతల ఆదిరెడ్డి కొండబాబు పాలకవర్గ సభ్యులు గొలుగూరి రామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నల్లమిల్లి పెద్దబ్బాయి రెడ్డి ,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి ఆర్ ఎల్ స్వామి ,డిగ్రీ కళాశాల డైరెక్టర్లు డివిఆర్ఏ పాపిరెడ్డి ,కే హరినాధ రెడ్డి, బి రత్నారెడ్డిలు అభినందించడం జరిగింది.