-
వ్యవశాయశాఖాధికారి పి గాంధీ.
MCN NEWS : శంఖవరం: తక్కువ మోతాదులో అవసరమైన మేరకే పురుగు మందులు వాడాలని విచక్షణ రహితంగా వాడరాదని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. వై ఎస్ ఆర్ పొలంబడి శిక్షణా కార్యక్రమం లో బాగంగా జగన్నాథ పురం లో పత్తి పంటలో రైతులతో పొలం పరిశీలన చేసి చీడ పీడల లక్షణాలు, నివారణ పద్ధతులు గూర్చి అవగాహన కల్పించారు.పంటలో శత్రు పురుగులు,మిత్ర పురుగులు అనుపాతాన్ని బట్టి పురుగు మందుల వాడకాన్ని చేపట్టాలని వివరించారు.పత్తిలో ఎర పంటలు,రక్షక పంటల ఆవశ్యకత గురించి వివరించారు.అనంతరం రైతు భరోసా కేంద్రంలో ఈ పంట నమోదును పర్యవేక్షించి సూచనలు ఇచ్చారు.ఉద్యాన సహాయకుడు సువర్ణ రాజు, ఎం.పి.టి. సి,రైతులు పాల్గొన్నారు.