MCN NEWS : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం లో పి .హెచ్.సి వైద్యాధికారిణి డాక్టర్ అంగర దేవి రాజశ్రీ సౌజన్యంతో 21-09-2022 మరియు 29-09-2022 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈరోజు శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ , మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలు మరియు అంగన్వాడి సెంటర్లు నందు జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరము నుండి 19 సంవత్సరముల వయస్సు ఉన్న పిల్లలకు పోషకాహార లోపం, రక్తహీనత, త్వరగా అలసిపోకుండా, శారీరిక మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉండకుండా పిల్లలు అందరికీ ఉచితముగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది అని వైద్యాధికారిణి అన్నారు… ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నారు అయిదు వేల అయిదు వంద ఇరవై ఆరు మంది పిల్లలకు ఆరోగ్య సిబ్బంది ద్వారా ఉచితంగా మాత్రలు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ దేవి తెలియజేశారు కార్యక్రమానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, స్కూల్ హెడ్మాస్టర్లు, అంగన్వాడీ సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్ డి. కృష్ణ శేఖర్ , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీమతి వాణి కుమారి, ఏఎన్ఎం బుజ్జి అషాలు పాల్గొనున్నారు.
స్టాఫ్ రిపోర్ట్రర్ : ప్రసాద్.