బహుమతులు అందజేసిన ఎంపీపీ ముత్తిరెడ్డి సుజాత
MCN NEWS భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో సంక్రాంతి పండగ సందర్భంగా రవీంద్ర పబ్లిక్ స్కూల్ లో గురువారం విద్యార్థులకు , ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ముత్తినేని సుజాత పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాతను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ దొడ్డ రమేష్, ఉపాధ్యాయులు ఉషశ్రీ, కవిత, కుసుమ, గీత, ఫాతిమా, పల్లవి, జ్యోతి, అనుషా,రుధా పాల్గొన్నారు.