MCN NEWS :
ఏలేశ్వరం: పట్టణంలోని అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శప్రాయుడని, చిన్న వయసులోనే పుస్తకాలను రచించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ వెంకట దుర్గాప్రసాద్, 14వ వార్డు కౌన్సిలర్ మూది నారాయణస్వామి, తూమురోతు గురవయ్య, బోదా చిరంజీవి, కటకం కిరీటి, చెక్క రాజు, అలమండ వీరరాఘవ స్వామి, ఉడతల రమణారావు తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద-ఎస్విఆర్
ADD
RELATED ARTICLES