MCN NEWS : యానం. యానం నియోజకవర్గంలో విద్యార్థులు టైపింగ్ స్కిల్స్ నేర్చుకుని తద్వారా పొందిన సర్టిఫికెట్ల ద్వారా ఎల్డీసి, యుడిసి వంటి ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నారని ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, డైరెక్టర్ జి లక్ష్మీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీసిద్దివినాయక టైపింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది ఎపి స్టేట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలి పుదుచ్చేరి ప్రభుత్వం ఎల్ డిసి పోస్టులు తీయడానికి నిర్ణయించారని ఈ నేపధ్యంలో దానికి అర్హతగా టైప్ లోయర్, హయ్యర్ గ్రేడ్ అడుగుతున్నారని ఈ నేపధ్యంలో 111 మంది విద్యార్థులు అత్యధికంగా శిక్షణ పొందుతున్నారన్నారు. అనంతరం స్టేట్ టైప్ రైటింగ్ పరీక్షలో ప్రథమస్థానాన్ని సాధించిన కుడిపూడి విజయలక్ష్మీ, ద్వితీయ స్థానం సాధించిన పి లీలావేణిని సత్కరించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లంక బంగారం. విత్తనాల వెంకటేష్. గణేష్,గంగా ప్రసాద్, తదితరులు పాల్గోన్నారు.
యానం విద్యార్థులు టైపింగ్ స్కిల్స్ లో స్టేట్ ప్రదమ స్థానం
ADD
RELATED ARTICLES