ఎంఎల్ఏ పర్వత ప్రసాద్
MCN NEWS : శంఖవరం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం పరిసరాల పచ్చదనంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పర్వత చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుక పార్టీ నేతలకే కాదు ప్రజలందరికీ పర్వదినం వంటిదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు,వైసిపి శ్రేణులు ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడం,రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని దీని కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, ఉప సర్పంచ్ చింతమనీడి కుమార్, వైకాపా నాయకులు బుర్ర లచ్చబాబు, మండల అభివృద్ధి అధికారి జే రాంబాబు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో రాజగోపాల్, ఏపిఎం ఏ వెంకటరమణ,వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.