MCN NEWS : .దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని,పోతవరం గ్రామం లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరియు జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి మాట్లాడుతూ భూమి పరిరక్షణ బాధ్యత అందరిది కావున ప్రతి ఒక్కరూ మీ మీ పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం లో భాగంగా గ్రామ గ్రామాన ఇంటింటా లక్షల కోట్ల మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.అలాగే విద్యార్థులతో వనాలను పరిరక్షించే బాధ్యత మన అందరిదని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, మరియు ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, వార్డ్ మెంబర్ కలుం వెంకన్న దొర కొమరం గణేష్ దొర సిహెచ్ విద్యాసాగర్ మొదలైన వారు పాల్గొన్నారు
మొక్కలు నాటుతున్న సర్పంచ్ తుర్రం రమాదేవి.
ADD
RELATED ARTICLES