చోద్యం చూస్తున్న అదికారులు
MCN NEWS : బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఐనవిల్లి సతీష్ గతం లో మానసిక రోగి.తనకు ఉన్న వ్యాధినెపంతో గ్రామంలో పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ జనం ను బయ బ్రాంతులకు గురి చేస్తూ వీదుల్లో తిరుగుతూ పిల్లల్ని కొట్టడం పెద్దల్ని నోటికి వచ్చినట్టు తిట్టడం చేస్తూ భార్యా పిల్లల్ని కూడా కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని పలుమార్లు అతనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా బ పోలీసులు అతనిపై ఔదార్యం చూపిస్తున్నారు.
గత కొంత కాలంగా తన భార్యను అనేక విధాలుగా వేధిస్తూ నా నా హింసలు కు గురి చేస్తూ మానసిక వ్యాధి నెపంతో అతడు మరియు అతని తండ్రి వెంకటేశ్వర రావు తమ్ముడు రమేష్ కలిసి ఆమెను మానసిక వేదకు గురి చేస్తున్నారు ఆమెను గత 15 రోజుల ముందు రాత్రి పూట బయటకు గెంటివేయగా ఆమె పెద్దలను పోలీసుల ను సాయం కోరగా పెద్దలు ఆమెకు గృహం ఏర్పాటు చేశారు. దానితో రెచ్చిపోయిన కుటుంబ సభ్యులు సతీష్ ను రెచ్చ గొట్టి ఆమె పనిచేసే వృద్ధుల బోజన శాల వద్దకు పంపి ద్వంసం చేయించారు. ఇద్దరు చిన్న పిల్లల తో బయ పడుతూ జీవిస్తున్న ఆమె అవసర నిమిత్తం బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తూ భయంకర వాతావరణ కల్పిస్తున్నారు.పిల్లలు స్కూల్ కి వెడితే అక్కడ కూడా ఇదే పరిస్థితి.కొడుకును రెచ్చ గొట్టి పంపి భయానక వాతావరణం గ్రామంలో కల్పిస్తున్న విషయం మీడియా ద్వారా పోలీసులకు సమాచారం అందినా మానసిక వ్యాధి నెపంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే నిజానికి ఆ మానసిక వ్యాధిగ్రస్తుడు తండ్రి వెంకటేశ్వరరావు తమ్ముడు రమేష్ కూడా కావాలనే అతని రెచ్చగొట్టే ఊరు మీదకు పంపించడంతో ఊరిలో కనిపించిన వాళ్లందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఆశ్రయం లేక ఉన్న ఆమె కు సాయపడుతున్న వారిపై దండెత్తి బెదిరించడంమే కాకా వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్లి చిందరవందర చేసి భయానక వాతావరణం కల్పించడం పై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు కూడా పోలీసులకు అందించడం జరిగిందని అయినా సరే పట్టించుకోవడంలేదనే అపోహ కూడా ఉంది
నిలువ నీడ లేక తిండి లేక ఇబ్బందులు పడుతున్న ఆమె రక్షణ కోరుతూ పిర్యాదు చేసుకొన్నా ఆమెపై పోలీసులు సానుభూతి చూపడం లేదని అదే విధంగా గ్రామంలో చిన్న పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందంటూ పలువురు భయపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి మానసిక రోగం పేరుతో అలజడి సృష్టిస్తున్న సతీష్ ని వెంటనే అదుపులోకి తీసుకొని అతని ప్రోత్సహిస్తున్న అతను తండ్రి వెంకటేశ్వర రావు ని తమ్ముడు రమేష్ ని అదుపులోకి తీసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.