Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeఏలూరుమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అష్టోత్తర పూజలు

మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అష్టోత్తర పూజలు

MCN NEWS : జంగారెడ్డిగూడెం. మంగళవారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకొన్నారు. ఈరోజు ఏలూరుకు చెందిన కోఠి రాజామణి, వెంకుభాయి, రమామణి స్వామివారి నిత్యాన్నదాన పదకమునకు రూ.25,000/-లు విరాళముగా సమర్పించినారు. ఈ రోజు మద్యాహ్నం గం.02.00 ల.వరకు స్వామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 1,35,923/- లు సమకూరినది.. సుమారు 1000 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈరోజు జంగారెడ్డిగూడెం నకు చెందిన శ్రీమద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ వారు మరియు సాయిచంద్ర జుయలర్స్ వారు ఆలయమువద్ద భక్తుల సౌకర్యార్ధం 6 సిమెంట్ బల్లలు అందజేసినారు. ఈ రోజు ఆలయమువద్ద ఊనగట్లకు చెందిన శ్రీమోహనకృష్ణ కోలాట భజన మండలి వారిచే కోలాటం కార్యక్రమము నిర్వహించబడినది. శ్రీ స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహన కృష్ణ (బాబీ), కర్పూరం రవి, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments