జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్
MCN NEWS : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రీ సర్వే పనులు, వైయస్ఆర్ జగనన్న భూ రక్షా మరియు భూ హక్కు పత్రాలు పంపిణీ కి చెందిన పనులు వేగవంతం చేయాలని తేజ్ భరత్ ఆదేశించారు. మండల పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రలు, భవన నిర్మాణ రంగంలోని పనులను మరింత వేగం చెయ్యాలని స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా, బ్యాంకుల ద్వారా అదనపు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తదుపరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ పూర్తి అయి, మిల్లర్ ద్వారా “సి ఎమ్ ఆర్” బియ్యాన్ని త్వరిత గతిన ఎఫ్ సి ఐ కు తరలించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. ఎఫ్ సి ఐ గోడౌన్ నుంచి ఎం ఎస్ ఎల్ పాయింట్ సరఫరా అవుతున్న రికార్డులను పరిశీలించామన్నారు. మంగళవారం ఉదయం బిక్కవోలు మండలంలో అధికారులతో కలిసి ఎం ఎస్ ఎల్ పాయింట్, ఎఫ్సీఐ గోడౌన్ తనిఖీ చేశారు. మండల పరిధిలోని వి ఆర్ వో, సెక్రెటరీ లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ కె. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ పూర్తి అయ్యిందని, మిల్లర్ నుంచి ఎఫ్ సి ఐ” గోడౌన్ లకు “సిఎమ్ఆర్” రైస్ తరలింపు ప్రక్రియ ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. తదుపరి ఎఫ్ సి ఐ గోడౌన్ నుంచి ఎం ఎస్ ఎల్ పాయింట్ కు సరఫరా అయిన బియ్యం యొక్క స్టాక్ కు సంబందించిన రికార్డులను, తదితర లెడ్జెర్ పుస్తకాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటన లో జేసీ వెంట ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, డి ఎస్ వో పి. ప్రసాద రావు, డి ఎం ఆర్. తనూజా, ఏ డీ సర్వే పి. లక్ష్మణ రావు, తహశీల్దార్ కే. పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.