MCN NEWS : శంఖవరం. భూ రీ సర్వే ద్వారా రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ జరుగుతుందని కాకినాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బివి రాజు తెలిపారు. మండలంలోని కత్తిపూడి గ్రామంలో గల 332,333 భూములను బీవీ రాజు రెవెన్యూ బృందంతో మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూకమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుందని . భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనుందని తెలిపారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్‌తో కూడిన భూపటాన్ని యజమానులకు జారీ చేస్తుందని దీంతో గ్రామ స్థాయిలోనే భూరికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయని వివరించారు. . సర్వే పూర్తయ్యాక భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరిoచి . రీసర్వే పూర్తయ్యాక తర్వాత తయారు చేసే కొత్త రెవెన్యూ రికార్డుల రూపకల్పనలో ఈ సవరణలు ఉపయోగపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రేవతి,వి ఆర్ ఓ యు శ్రీనివాస్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శివ , రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూ రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ
ADD
RELATED ARTICLES