ఐ సి డి ఎస్ సి డి పి ఓ అరుణశ్రీ
MCN NEWS : శంఖవరం : బాలికల్లో జ్ఞానం పెంపొందించడం, తమను తాను రక్షించుకోవడం తో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ ఇంచార్జ్ సిడిపిఓ అరుణశ్రీ తెలిపారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల రామాలయం వద్ద జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు, అంగన్వాడి కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఐసిడిఎస్ సిడిపిఓ అరుణ శ్రీ మాట్లాడుతూ లింగపరమైన బేధాల రూపుమాపడం, బాలికల చదువును ప్రోత్సహించడం, వారి జీవనానికి రక్షణ కల్పించడం ధ్యేయంగా మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య కుటుంబ సంక్షేమo, కలిసి బేటి బచావో బేటి పడావో అంటూ విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నాయని,కిషోర్ బాలికల ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషకాహార లోపాలు,రుతు క్రమ పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని తెలిపారు. కిశోర బాలికలకు అవసరమైన అన్ని రంగాల్లో నిర్ణయాత్మక భాగస్వామ్యం కల్పించడం నేటి సమాజం తక్షణ అవసరమని, కుటుంబాల్లో, సమాజంలో వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బాలికలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించాలని, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలని, హక్కులు పొందడంలో వారికి సహాయపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బుల్లెమ్మ, నూక రత్నం, సుశీల, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.