MCN NEWS : జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఎలిజా ఆయనతోపాటు వారి కుటుంబం వస్తున్న కారు. కరెంటు స్తంభాన్ని ఢీకొని భారీ ప్రమాదానికి గురైంది. ఈరోజు మంగళవారం ఉదయం తెల్లవారుజాము మూడు గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం ఎమ్మెల్యే ఎలిజా. కుటుంబం ఆడమిల్లి గ్రామంలో భారీ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా చింతలపూడి నియోజకవర్గ ఉలుక్కుబడింది..
అయితే ఆ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో కార్యకర్తలు నాయకులు అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆడమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ప్రమాద వార్త తెలిసినంతనే పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులకు నాయకులకు సమాచారం అందించారు
అయితే ప్రమాదం అనంతరం జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీపీ కొదమ జ్యోతి జడ్పిటిసి బాబ్జి లక్కవరం సర్పంచ్ శ్రీనివాసపురం ప్రస్తుత సర్పంచ్ పార్థసారథి తదితరులు పాల్గొని ఆయనకు జరిగిన ప్రమాదాన్ని అడిగి తెలుసుకున్నారు తడిపినపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు