MCN NEWS, శంఖవరం :ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు .. తత్వవేత్త స్వామి వివేకానంద స్వామిఅని వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశం ప్రతి సంవత్సరం జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది అని ఆయన ప్రపంచంలో యువతకు స్ఫూర్తి ప్రదాత అని సాయి ప్రియ ట్రేడర్స్ అధినేత జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు . మండలంలోని కత్తిపూడి సాయిప్రియ ట్రేడర్స్ కార్యాలయం నందు స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజనుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిప్రియ సేవాసమితి వ్యవస్థ స్థాపక అధ్యక్షులు,చైర్మన్ జ్యోతుల శ్రీనివాసు గంగభవానీల పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ చరిత్ర సంస్కృతి పట్ల ఎంతో గౌరవం కల్గి దేశప్రజలు అందరు దేశ చరిత్రసంస్కృతి పట్ల గౌరవంగా ఉంటు,ముఖ్యంగా యువకులు దేశభక్తి ని కల్గి ఉండాలని, భారతదేశం చరిత్రసంస్కృతి గూర్చి ప్రపంచదేశాలకు చాటి చెప్పేరని కాబట్టి ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద చూపించిన మార్గాన్ని ఆచరించాలని ఆకాంక్షించారు.అనంతరం స్వీట్స్ పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సీతారాంబాబు గ,గౌతు సాయి గ,జ్యోతుల నానాజీ సమర్పణరావు, విప్పర్తి శ్రీను, జ్యోతుల వినయ్, జ్యోతుల అజేయ్, పిఠాపురం మండల సాయిప్రియసేవసమితి కార్యదర్శి మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ యువతకు వివేకానంద స్ఫూర్తి – జ్యోతుల శ్రీనివాస్.
ADD
RELATED ARTICLES