సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు
వస్త్ర, అన్నదానాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ.
శంకవరం మండల అభివృద్ధి కార్యాలయంలో రెడ్‌క్రాస్‌తో కలిసి భారీ ఎత్తున రక్తదాన శిబిరo
గత రెండు రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు
MCN NEWS : శంఖవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మండలాల్లో గల ప్రతి గ్రామంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. . ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు, అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టారు . శంఖవరం మండల అభివృద్ధి కార్యాలయంలో రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 500 రక్త యూనిట్లను సేకరించారు . సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా తొలి రోజు సోమవారం భారీ ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించగా వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇక రెండో రోజైన మంగళవారం పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారని . మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారని . డీబీటీ, నాన్ డీబీటీ వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారని . దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారని . తద్వారా సీఎం వైఎస్ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని . సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు . అనంతరం బ్లడ్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభించి, క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు కూడిపూడి భరత్, ఎంపీపీ పర్వత రాజబాబు, మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు, మండల విద్యాశాఖ అధికారి ఎస్ వి రమణ, మండల వైద్యాధికారి ఆర్ వి వి సత్యనారాయణ, వైద్యులు ఎస్ రాజీవ్, ఏపీవో రాజగోపాల్, ఏపిఎం వెంకటరమణ, మండల కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ,సర్పంచులు కొల్లు వెంకట సత్యనారాయణ, సకురు గుర్రాజు, రామిశెట్టి ఏసుబాబు,నరాల శ్రీనివాస్, కూని శెట్టి మాణిక్యం, ఉప సర్పంచ్ చింతమనీడి కుమార్, గౌతు నాగు, వైకాపా నాయకులు బుర్ర లచ్చబాబు, అడపా సోమేష్, గౌతు దొరబాబు, మాదేపల్లి మహేష్, దడల బాబ్జి, చల్ల సత్యప్రసాద్ జీలకర్ర విష్ణు, చొప్ప రాంబాబు, నడిగట్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు,