MCN NEWS :యానాం యానాం నియోజకవర్గంలో
విలక్షణమైన ప్రజాతీర్పునిచ్చి దేశాన్ని యానాం వైపుకు ఏవిధంగా చూసేలా చేశారో అదేవిధంగా గురువారం నుంచి యానాం ప్రజాసమస్యలపై తాను సిఎం రంగసామికి ఇచ్చిన 15 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దిగుతున్న ఆమరణనిరాహారదీక్షకు నియోజకవర్గ ప్రజలంతా మద్ధతుగా నిలవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన కార్యాలయం వద్ద వందలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, మహిళలనుద్దేశించి మాట్లాడారు. యానాం ప్రజలకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చేవరకు జీవితాంతం పోరాట మార్గాన్ని ఆపే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా యానాం ప్రజలు ఓటువేయలేదని తిరస్కరించారనే అక్కసుతోనే సిఎం ఈ ప్రాంతంపై వివక్షత ప్రదర్శిస్తున్నారని, దీనికి తోడు గతనెల 7వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ఎదుట వివిధ ప్రజాడిమాండ్లు కై చేసిన ఆమరణ నిరాహార దీక్ష తాను చేస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమాధానం చెప్పకుండా ప్రజాఉత్సవాల ముగింపు సభకు యానాంకు సిఎం రంగస్వామి వస్తే ఆయనను అడ్డుకుంటామని, ఊరిలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తేలేదన్నారు. పెద్దమనస్సుతో రంగసామి డిమాండ్లను నెరవేరిస్తే పూలమాలలతో ఊరేగిస్తామని లేదంటే రానివ్వమని స్పష్టం చేశారు. తాను ప్రజలు, కార్యకర్తలకోసం ప్రాణాలు ఆర్పించడానికి సైతం వెనుకాడనన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగత స్వార్థంతో రీజెన్సీఫ్యాక్టరీ మూసివేతతో స్థానిక నిరుద్యోగులకు ఉపాధిలేకుండాపోయిందన్నారు. అదేవిధంగా గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి, ఉపాధి కల్పన లేకుండాపోయిందని విగ్రహాలు, ఈఫిల్టవర్ తప్ప ఏమీ లేదన్నారు. 25 ఏళ్లపాటు పాలించిన నాయకుడు ప్రస్తుతం కక్షపూరితరాజకీయాలు చేస్తూ ఆఖరికి యానాం ప్రజలను ఇబ్బందిపాల్టేస్తున్నాడని ఆరోపించారు. మత్స్యకారులకు వచ్చే ఒఎన్ జీసి పరిహారం సైతం పక్కదోవపట్టించారని విమర్శించారు. ఎస్సీ రైతులకు ఇచ్చే ఒఎన్ జిసీ పరిహారాన్ని సైతం రాకుండా ఢీల్లీ ప్రతినిధినని చెప్పుకుంటూ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. 71 మంది రోగులకు సిఎం రిలీఫ్ ఫండ్ ను ఇవ్వకుండా రూ.32 లక్షల ప్రజాధనంతో వృధాఖర్చుతో నిర్వహిస్తున్న ప్రజాఉత్సవాలకు, తనకు సంబంధం లేదని, తనతో వాటిపై ఏవిధంగాను చర్చింలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పండు సిద్ధార్థకుమార్, కాటంశెట్టి రామ్మూర్తి,
మోడే హరిశ్చంద్ర, మంగా సత్యనారాయణ. చెక్కల ఆరుణ కుమార్, నక్కల సుబ్బన్న, కాకి నాగేశ్వరరావు, మచ్చా శ్రీను, తాజుద్ధీన్, తదితరులు పాల్గొన్నారు.