MCN NEWS : ఏలేశ్వరం. నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఆర్దిక పరిపుష్టికి పోలవరం మట్టిపై అధికారాలు అప్ప చెప్పాలని పలువురు కోరుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆయాంలో నిర్మాణాలు చేపట్టిన పోలవరం కాలువ లోని మట్టిని గుట్టలు గుట్టలుగా పోసి నిరుపయోగంగా వదిలేశారు. అప్పటినుండి ఆ మట్టిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తరలించుకుపోయి ఇళ్ల స్థలాలు చదును చేసుకోవడానికి, లేఅవుట్లు చేసుకోవడానికి, పునాదులు పూడ్చుకోవడానికి ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. జెసిబిలు పెద్దపెద్ద లారీలు వినియోగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సామర్లకోట తుని షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి అనేక మంది రైతు కూలీలు పనులు లేక వలసలు పోతున్నారు. ఆ ఫ్యాక్టరీలకు చెరుకు పంటలు సాగు లో ఉండగా ఎకరాకు పదిమంది కూలీలకు 42నుండి 50 రోజులు పని దొరికేది. చెరుకు సాగు లేక గ్రామాల్లో పని దొరకక కూలీలు వలసలు పోతున్నారు. పుష్కర మట్టిని పంచాయతీలకు అప్పజెప్పి యంత్రాలతో కాకుండా కూలీలతో ట్రాక్టర్ ద్వారా ఎగుమతి చేయించడం, ట్రాక్టర్ మట్టికి పంచాయతీకి ఎంతో కొంత రేటు పెట్టడం ద్వారా పంచాయతీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందుతాయని పలువురు పేర్కొంటున్నారు.
పోలవరం మట్టిని పంచాయతీలకు అప్పగించాలి
ADD
RELATED ARTICLES