MCN NEWS : రాజవొమ్మంగి మెట్ట జ్యోతి, రాజువొమ్మంగి స్థానిక ఎంపీపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న పూర్ణఆకాష్ కి చిట్టి గుండెకు చిన్ని సహాయం కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి బాక్స్ ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలు తెరవడం జరిగింది పిల్లలు దయా హృదయంతో తోటి విద్యార్థికి సేకరించిన మొత్తం 6262/- రూపాయలు వైద్య ఖర్చులు నిమిత్తం తల్లి తండ్రులకు ఉపాధ్యాయులు సమక్షంలో అందించారు. పిల్లల పెద్ద మనసుతో సహాయం చేసే ఆలోచన ఆవయసుకు రావడం గొప్పదని ఎంపీపీ స్కూల్, రాజవొమ్మంగి ప్రధానోపాధ్యాయులు, ఎం. రాంబాబు అభినందించారు. మానవత్వం మరిచి ఎదుటివారిని పట్టించుకోని ఈ రోజుల్లో తోటి విద్యార్థులు చేసిన సహాయాన్ని పలువురు అభినందించారు, ఈ సహాయ కార్యక్రమంలో, లోవరాజు. వెంకటలక్ష్మి, మంగదేవి , లక్ష్మీ ప్రశన్న ,విఘ్నేశ్వర రావు ,హరినాధ్ , కొండబాబు పాల్గొన్నారు
పెద్ద మనసుతో చిన్ని గుండెకు సహాయం
ADD
RELATED ARTICLES