MCN NEWS : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం లో విద్యార్థులలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పూర్వ విద్యార్థి కాళ్ల శ్రీను పాఠశాల మీద ఉన్న అభిమానంతో విద్యార్థులలో విద్య , చైతన్యం తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా చిరుద్యోగి అయిన.. పెద్ద మనసుతో టెన్త్ క్లాసు లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డెస్క్టాప్ మరియు వివిధ రకాల బహుమతులు సమకూర్చి తన వ్యక్తిత్వాన్ని చాటారు . ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. వి. రవిసాగర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతి ప్రధానం చేసి విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం జరిగింది. ఈ బహుమతులకు సుమారుగా 50 వేల రూపాయలు వెచ్చించిన పూర్వ విద్యార్థి కాళ్ల శ్రీను ను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థిగా పాఠశాల మీద ఉన్న అభిమానానికి, విద్యాలయాన్ని దేవాలయముగా భావించి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమానికి అనపర్తి మార్కెటింగ్ డైరెక్టర్ తేతలు సుబ్బరామిరెడ్డి, వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు పడాల కమలారెడ్డి, యోగ మాస్టర్ వెలగల ఫణి కృష్ణారెడ్డి, మల్లిడి రుద్రారెడ్డి, మంగి రెడ్డి గారి శ్రీను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్ : పలివెల ప్రసాద్