MCN NEWS : జంగారెడ్డిగూడెం. పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేయటమే గడపగడపకు మన ప్రభుత్వం ఉద్దేశిమని ఎమ్మెల్యే తెలిపారు.
ఇంకా ఎవరైనా పథకాలు తమకు అందటం లేదని తెలిపితే అక్కడక్కడ పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి ఎంపీపీ కొదమజ్యోతి వైఎస్ఆర్సిపి మండల ప్రెసిడెంట్ వామిశెట్టి హరిబాబు గురువాయు గూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి సర్పంచ్ సాయిల్ సత్యనారాయణ వై ఎస్ ఆర్ సి పి ప్రముఖ నాయకులు కొలను వాడ సాయిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చక్రదేవరపల్లి పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయినా కూడా ఎమ్మెల్యే ఇక్కడ పాల్గొనటం విశేషంగా చెప్పవచ్చు