మెట్టజ్యోతి: అనకాపల్లి. ఆధ్యాత్మిక సేవా భావంతో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఎం వి అర్ ట్రస్ట్ నిలుస్తుందని, ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. బుచ్చయ్య పేట మండలం తట్టబంద గ్రామంలో వేంచేసియున్న రామాలయ ఆలయ నిర్మాణ అభివృద్ధికి కొరకు ఆలయ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ముత్యాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ గ్రామానికి విచ్చేసిన ఆయన్ను కమిటి సభ్యులు మహిళలు ఊరు పొలిమేర నుండి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వెంకటే శ్వర రావు ఆలయ కమిటీ సభ్యులకు ఆర్థిక సాయం తన వంతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సేవలందించేందుకు ఎం వి అర్ ట్రస్ట్ స్థాపించినట్టు చెప్పారు. విద్య వైద్య దేవాలయాలు అభివృద్ధి వంటి సేవలు అందించేందుకు ఈ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు సేవలు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందాల పల్లెల్లో ప్రజలంతా సుఖ శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ రమణ, బండారు గణేష్ ,జి ఈశ్వరరావు, మాలిసా బాబ్జి,శెట్టి ప్రతాప్ .వేగి వెంకట రావు, బ్రహ్మాజీ.శర్మ,సుంకర బాబ్జి. ప్రేమ్,అప్పలరాజు, బ్రహ్మాజీ, మాల్యాధి.ప్రకాష్.రవి, ఎర్రయ్య.శివ, చిట్టి సునీల్ దిలీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
పల్లెల్లో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి.
ADD
RELATED ARTICLES