Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాపర్యావరణాన్ని అందరూ పరిరక్షించాలి 

పర్యావరణాన్ని అందరూ పరిరక్షించాలి 

MCN NEWS : రాజవమ్మంగి మెట్టజ్యోతి,జగనన్న జన్మదిన వేడుకల్లో భాగంగా జగనన్నపచ్చతోరణం కార్యక్రమం రాజవొమ్మంగి మండలం జడ్డంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జెడ్పీటీసీ వడుగుల జ్యోతి ప్రారంభించారు, రాజవొమ్మంగి రేంజ్ ఆఫీసర్ మడకం అబ్బాయిదొర తో పాల్గొని మొక్కలు నాటారు. ప్రకృతిని పరిరక్షిస్తూ మనం మొక్కలు నాటి వాటిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షస్తుంది అని,పర్యావరణాన్ని కాపాడే భాధ్యత మనందరం తీసుకోవాలన్నారు.విద్యార్థి దశ నుండే ప్రతి పుట్టినరోజున ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు.జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న జగనన్న పచ్చతోరణం కు అపూర్వ స్పందన లభిస్తోందని జెడ్పీటీసీ జ్యోతి అన్నారు.ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ మడకం అబ్బాయిదొర,మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్, చెరుకుంపాలెం ఫారెస్టర్ కె.బాలాజీ,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.అప్పారావు, జెడ్.పి.హైస్కూల్ ఇంఛార్జి హెడ్ మాస్టర్ నాగరాజు మొక్కలు నాటి,జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసగించారు.ఫారెస్ట్ బెస్ క్యాంప్ సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments