MCN NEWS : అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనపర్తి పంచాయతీ కార్యాలయంలో పండుగలా జరిగాయి. పంచాయతీ పాలకమండలి సభ్యులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్న ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జన హృదయాధినేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనసులను చూరగొన్నారన్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు వార కుమారి, చిర్ల వీరరాఘవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లిడి విజయ్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్య సూర్యనారాయణ (బుజ్జి), అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్తి వెంకటరామారెడ్డి, రాష్ట్ర బట్ట రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టి రాజు, పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పండుగలా జగనన్న జన్మదిన వేడుకలు
ADD
RELATED ARTICLES