MCN NEWS : శంఖవరం: నులి పురు గుల నివారణతోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని కత్తిపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలం లోని కత్తిపూడి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో జాతీ య నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ నులి పురుగుల ద్వారా శరీ రంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపో వడం, బలహీనత, కడుపునొప్పి, బరువు తగ్గడం వం టి ఇబ్బందులు తలెత్తుతాయని, నులి పురుగుల నివా రణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. అపరిశుభ్రత వల్ల నులి పురుగుల వ్యాప్తి జరుగుతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. నులి పురుగులు పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతాయని, ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వైద్యుల సూచనలు, సలహలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూలు ప్రధానోపాధ్యాయులు ఎ సుబ్రమణ్యేశ్వరరావు ,స్కూల్ చైర్మన్ వెలగా బుల్లి పాపారావు, యమ్ పి టి సి చొప్పా రాంబాబు, ఎయన్ యమ్ లు రామలక్ష్మి, నాగమణి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
నులి పురుగులు నివారణతో మెరుగైన ఆరోగ్యం.
ADD
RELATED ARTICLES