MCN NEWS :అనపర్తి :తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి డెల్టాలో రెండో పంటకు సంబంధించి నీటి సరఫరా సక్రమంగా జరగని పరిస్థితిలో రైతులు నీటి కొరత ఎదుర్కొoటున్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి, బిక్కవోలు, అనపర్తి మండలాలకు సంబంధించి నీటి ప్రవాహం తగినంత లేక రైతులు దమ్ములు చేసుకోడానికి కానీ, మరల రెండో పంటకు ఎద జల్లు కోవడానికి కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎందుర్కోoటున్నారు. మరి సాగునీటీ శాఖ ఏ విధంగా వ్యవహరిస్తోందో ఎవరికి అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే ఈ సంవత్సరం తగ్గినంత కాదు ఎక్కువగా వర్షాలు కురిసాయి. అయినప్పటికి స్టోరేజ్ ఏ విధంగా ఉందొ తెలియదు కానీ పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయని పరిస్థితి చవిచూస్తున్నాం. వర్షాలు లేని పరిస్థితులు ఉన్నపుడే రెండో పంటకు నీరు అందించిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానిది. మరి వైస్సాసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి పంటలో ఒక రకమైన ఇబ్బందులు, రెండో పంటలో ఇంకో రకం ఇబ్బందులు ఎందుర్కోoటున్న పరిస్థితి వస్తుంది.దమ్ములు చేసుకునే పరిస్థితి లో నీటి సమృద్ధిగా ఉంచాల్సిన పరిస్థితినీ లేకుండా రెండో పంటను ఇబ్బందులలోకి నెట్టేసిన పరిస్థితి. రెండో పంట నాట్లు వేయడం ఆలస్యం అయింది. దాదాపుగా నెల రోజులు లేటుగా నాట్లు ప్రారంభమైయాయి.మొదటి పంటలోనే రైతులను ధాన్యం అమ్ముకోవడంలో తీవ్రమైన ఇబ్బందులకు, కష్టాలకు వైస్సార్సీపీ ప్రభుత్వం గురిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రైతులకు చాలా మేలు చేస్తున్నాని మాట్లాడే వ్యక్తి రైతులకు సంబంధించి అన్ని విషయాలలో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు నోరుమేదపని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాగు నీటి సంఘాలు ఉండటం, సాగు నీటి సంఘాల ప్రజాప్రతినిధులు నీటి ఏద్దడి ఉన్న ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుని, గ్రామాలలో రైతులతో సమన్వయం చేసుకుని,రైతులతో సభలు నిర్వహించి రైతులకు అవగాహనా కల్పించి ఆ రోజు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చేయడం జరిగింది. ఎక్కడైనా కాలువలలో పూడికతీత గానీ, ఎక్కడైనా సాగునీరు సరఫరా చేయడంలో కానీ, తూడు తొలగించడంలో కానీ సాగు నీటి సంఘాలు సక్రమంగా చేయడం జరిగేది. కానీ సాగునీటి సంఘాలు లేవు.గ్రామాలలో ఉన్న స్థానికంగా వైసీపీ నాయకులు వివిధ కార్యక్రమాలు క్రింద డబ్బులు దండుకొనే కార్యక్రమం తప్పించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో విఫలమవడం జరిగింది. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నవంబర్ నెలలోనే నాట్లు వేయడం జరిగేది కానీ నీటి కొరత వలన నాట్లు వేయడం ఆలస్యమవడంతో డిసెంబర్ నెలలో నాట్లు వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి రైతుల దగ్గర నుండి డబ్బులు దండుకోవడం తప్పించే వేరే ఆలోచన లేదు. రైతులు కష్టాలు పట్టించుకునే కార్యక్రమం చేయరు. మాట్లాడితే కెనాల్ రోడ్ పై ధర్నా చేస్తాను రైతులకు న్యాయం జరగకపోతే అని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి రైతులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం చేయరు. కార్యరూపంగా మంత్రుల దృష్టికి కానీ , ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకువెళ్లే ఆలోచనలేనీ వ్యక్తి ఎవరైన ఉన్నారoటే అది అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే.అనపర్తి నియోజకవర్గంలో నీటి కొరత వలన రైతులు ఇబ్బందులు గురవుతున్నారు.రైతులకు తగినంత సాగునీరు తక్షణమే అందించాల్సినదిగా తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదానరెడ్డి, బసివిరెడ్డి పాల్గోన్నారు.
తక్షణమే రైతులకు సాగునీరు అందించాలి
ADD
RELATED ARTICLES