Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాటి బి వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టిక ఆహారం

టి బి వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టిక ఆహారం

MCN NEWS :బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రమైన బిక్కవోలు గ్రామంలో గల ప్రాథమిక వైద్యశాలలో సోమవారం టిబి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సుమారు 700 రూపాయల విలువగల పౌష్టికాహారాన్ని 19 మందికి అందించామని డాక్టర్ రాజీవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలబద్రపురం గ్రాసిం ఇండస్ట్రీస్ సహాయంతో టిబి పేషెంట్లకు పౌష్టికాహారం కిట్లు అందించడమే కాకుండా వైద్యశాలకు వచ్చిన వ్యాధిగ్రస్తులకు బ్లడ్ ప్రెషర్ , బరువు , ల్యాబ్ టెస్ట్లులు కూడా నిర్వహిం చడం జరిగినదని డాక్టర్ రాజీవ్ అన్నారు. రెండు వారాలు మించి దగ్గు , జ్వరం , ఛాతీనొప్పి , బరువు తగ్గడం , కళ్ళి లో రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని మరియు త్వరగా వ్యాధిని గుర్తించుట ద్వారా ఇతరులకు ఈ వ్యాధి సంక్రమించకుండా నివారించొచ్చు అని తెలిపారు . డాక్టర్ దుర్గదేవి మాట్లాడుతూ టిబి వ్యాధికి మందులు ఉచితంగా ఇస్తారని , నిర్ధారణ అయితే ఆరు నెలలు టిబి మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని , తద్వారా ఇతరులకు వ్యాధి సోకకుండా కాపాడవచ్చని ఫలితంగా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచు కోవచ్చని తెలిపారు . ఈ కార్య క్రమంలో పి హెచ్ సి సిబ్బంది , టి బి. సూపర్ వైజర్లు మహేష్ అమృత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments