,రాజవొమ్మంగి, మెట్టజ్యోతి, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజువొమ్మంగి మండలంలో వెలుగు వీవోలు ద్వారా 2021 సంవత్సరంలో కొనుగోలు చేసిన జీడిపిక్కల సొమ్ములు చెల్లించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు, కార్యాలయం వద్ద బయట నుంచి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ సందర్భంగా సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు మాట్లాడుతూ,2021లో వెలుగు ద్వారా కొనుగోలు చేసిన జీడిగింజలకు ఈరోజుకి ఆయా రైతులకు డబ్బులు చెల్లించలేదని,ఈ విషయాన్ని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన, షరతులు పెడుతున్నారు తప్ప సమస్య పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు,నెలలు గడిచిన రైతులకు డబ్బులు ఇవ్వటం లేదన్నారు, ఇటీవల సిపిఎం పోరాట ఫలితంగా ఇప్పుడు వెలుగు విడివికే ద్వారా కొనుగోలు చేసిన జీడిపెక్కలకు రైతులకు డబ్బులు వచ్చాయని అధికారులు చెబుతున్నారని, రైతు మిత్ర ద్వారా కొనుగోలు చేసిన జీడిపిక్కలకు డబ్బులు ఇవ్వటం లేదని ఇదెక్కడ అన్యాయం అని ప్రశ్నించారు,రైతులకు డబ్బులు అందే వరకు వెలుగు రైతులతో వెలుగు కార్యాలయం ఎదుట బయటయింపు,ఆందోళన చేపడుతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ్ల సూరిబాబు,కుంజం జగన్నాథం, పాండవుల సత్యనారాయణ,కె అప్పలరాజు,పి సత్యనారాయణ,పి చిన్నారావు,జె రాజు తదితరులు పాల్గొన్నారు.
జీడి పిక్కల సొమ్ములు చెల్లించాలి, వెలుగు కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా
ADD
RELATED ARTICLES