ఆంధ్రన్యూస్
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ వారు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మరియు మీడియా మిత్రులకు, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలు భక్తి భావం, సామరస్యంతో ఆనందోత్సాహల మధ్య వినాయక చవితి పండుగ, గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని, గణనాథుడు అన్నివేళలా మిమ్మల్ని దీవించాలి, మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విజ్ఞాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
జిల్లాలో ఉన్న వినాయక మండప నిర్వాహకులు పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు లేదా డయల్ 100 పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన …. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
ADD
RELATED ARTICLES