MCN NEWS : జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం, జనవరి 10:ఈ నెల 12 వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా జనసేన పార్టీ
ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలం
లో యువశక్తి పేరు మీద గొప్ప బహిరంగసభ జరుగుతుంది, ఈ బహిరంగ సభ లో జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ , రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
నాదెండ్ల మనోహర్ , లు పాల్గొని మాట్లాడతారని వీరితో పాటు 100
మంది యువకులతో సమావేశపరిచి ఈ బహిరంగ సభ లో యువకుల కష్ట సుఖాలపైన మాట్లాడిస్తున్నారని చింతలపూడి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మేకా
ఈశ్వరయ్య తెలిపారు ఆయన ఇంటి వద్ద జరిగిన ప్రింట్
మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్ల సమావేశం లో వెల్లడించారు. ఈ సభ కు చింతలపూడి
నియోజకవర్గం నుండి జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్య లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసినారు. ఈ సమావేశం లో జంగారెడ్డిగూడెం మండలం జనసేన పార్టీ
అధ్యక్షులు ఆకుల రాకేష్, పార్టీ సీనియర్ నాయకులు బండారు గంగ సురేష్
, తదితరులు మాట్లాడినారు, అలాగే ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు షేక్ పీరూ, దాకారపు ప్రసాద్, యరమాల శివ, సూరవరపు శేషు, బండారు చిన్ని,
మంగరాజు,కామవరపు అంజి,మడకా రవి తదితరులు పాల్గొన్నారు.