MCN NEWS : కిర్లంపూడి కాకినాడ జిల్లా : కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను వైయస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఆడారి మహేష్ సంగన వెంకటేశ్వరరావు, పీలా లోవసుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు నాయకత్వంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా యంగ్ మాన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, కిర్లంపూడి సొసైటీ అధ్యక్షుడు చదలవాడ బాబీలు విచ్చేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఏర్పటు చేసిన బర్త్డే కేక్ ను కట్ చేసి అక్కడ ఉన్న కార్యకర్తలకు గ్రామస్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించి వైయస్సార్ ఆశయ సాధనకు పాటుపడతామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, నాయకులు దిడ్డి గణపతి, సూరిశెట్టి దుర్గారావు, యల్లపు నానాజీ, రాపేటి ప్రసాద్, దాడి పెద్ద బుజ్జి, పిల్లాశ్రీనివాస్, పెంటకోట వీరబాబు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
చిల్లంగి లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు.
ADD
RELATED ARTICLES