సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ
MCN NEWS : శంఖవరం : దేశ చరిత్ర లో ఎన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు పొందారని కత్తిపూడి గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ తెలిపారు . మండలంలోని కత్తిపూడి గ్రామపంచాయతీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య భారీ కేక్ కట్ చేసి పేదలకు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి తమ నాయకుడు పై గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం అని . దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా పరిచయమైన జగన్… తండ్రి మరణానంతరం కాంగ్రెస్ను ఢీ కొట్టి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని . అనంతరం ఓ పార్టీని స్థాపించి ప్రజల మధ్యలోకి వెళ్లారని . ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగటమే తెలిసిన నేతగా పేరు సంపాదించారని . అధికారం లేకున్నా పార్టీని కాపాడుకుంటూ వచ్చారని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలితో సునామీ సృష్టించి . ఒక్క అవకాశమంటూ ఎన్నికల రణరంగంలోకి దిగిన ఆయన నవ్యాంధ్రుల మనసు గెలిచి ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని తెలిపారు. పాదయాత్రలో స్వయంగా ప్రజల కష్టాలు తెలుసుకుని ఇచ్చిన హామీల మేరకు నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసి, పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా రూపొందించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజలు మనసు గెలుచుకుంటూ తిరుగులేని నాయకుడిగా పేరు పొందుతున్న వ్యక్తి జగనన్న అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ, ఉప సర్పంచ్ గౌతు నాగు, పెద్దాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దడాల బాబ్జి, ఎంపీటీసీలు చల్లా సత్యప్రసాద్, చోప్పా రాంబాబు, వైకాపా నాయకులు తోట కృష్ణ, అడపా సోమేష్, రామిశెట్టి వీరబాబు, బుల్లి పాపారావు, జీలకర్ర లక్ష్మణ్, మాదేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.